ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026 క్యాలెండర్
గోడపత్రిక ఆవిష్కరణ
నాగర్‌కర్నూల్, (మన ఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, గోడపత్రికలను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి.శేఖర్, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ నరహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నర్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు జానకి దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. ఆనంద్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి.శేఖర్ మాట్లాడుతూ.. రోగికి వైద్యుడి తర్వాత అత్యంత కీలకంగా సేవలందించేది నర్సింగ్ అధికారులేనని అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ అధికారుల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు. 2026 సంవత్సరంలో నర్సింగ్ అధికారులు ఐక్యతతో పనిచేస్తూ జిల్లాలోని రోగులకు మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ సూపరింటెండెంట్ పెర్సీ సుమన్, హెడ్ నర్సులు నిర్మల, అమూర్త, నర్సింగ్ అధికారుల అసోసియేషన్ సభ్యులు యాదగిరి, మన్మోహన్ రెడ్డి, మరియమ్మ, రాజశేఖర్, కేశవ్, అంజి, కిరణ్, రాజు, మహేష్, జ్ఞానేశ్వరి పాల్గొన్నారు. అలాగే రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ దశరథం, మినిస్ట్రీయల్ సిబ్బంది రామచంద్రయ్య, రవి, కమిటీ సభ్యులు రూప, సువేద, కవిత, పద్మ తదితరులు హాజరయ్యారు.



