25 శివదీక్ష స్వాముల ఇరుముడి కార్యక్రమం..


 *తాడూరు మండల వైభవంగా వీరభద్రుని సేవ...*


సోమవారం నాడు 10గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం....


మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తాడూరు మండల శివస్వాముల ఆధ్వర్యంలో ఆదివారం నాడు వీరభద్రుని సేవ వైభవంగా జరిగింది. శ్రీ భోగ లింగేశ్వర స్వామి శివాలయ నుండి తాడూరు మండల కేంద్రంలోని ప్రధాని వీధుల గుండ వీరభద్ర సేవ శివదీక్ష స్వాములచే జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శివ స్వాములు, భక్తులు, గ్రామస్తులు ఉంటారు.ఈనెల 24న సోమవారం నాడు శ్రీ ఉమా భోగ లింగేశ్వర స్వామి దేవాలయం లో ఉదయం 10 గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగినట్లు ఆలయ ప్రధానార్చకులు జంగం శంకరయ్య,గురు స్వామి శివుడు తెలిపారు.ఈనెల 25న మంగళవారం నాడు శివదీక్ష స్వాముల ఇరుముడి కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఉంది. ఈనెల 26న శివరాత్రి రోజు ప్రత్యేక ఆలయ అభిషేక పూజలు తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రధాన అర్చకులు జంగం శంకరయ్య ప్రత్యేక పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని వారు పేర్కొన్నారు.

Post a Comment

Previous Post Next Post