కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 మంది బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు
కల్వకుర్తి, జనవరి 18 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డుకు చెందిన 30 మంది బీఆర్‌ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్‌లో జరిగిన కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో వీరు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి రత్నమాల బృంగి ఆనంద్ కుమార్, పట్టణ అధ్యక్షులు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, సోఫీ జరిగింది. పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను చూస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల అభివృద్ధికి సమాన న్యాయం జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపల్లి జగన్, కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఏజాస్, సతీష్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, నాయకులు చిగుళ్లపల్లి సతీష్, జమ్ముల శ్రీకాంత్, నిజాం, అబ్దుల్ అలీం, సయ్యద్ తాయూబ్, అబ్దుల్ ఖయ్యుమ్, మాసుమ్, ఖాజా పాషా, గేసు, అబేద్, శ్రీనివాస్, నసీర్, అలీమ్, రషీద్, అన్వార్, జుబేర్ ఉన్నారు.
