ఆటో యూనియన్ అధ్యక్షులుగా షేక్ హాజీ

 ఆటో యూనియన్ ఎన్నికల్లో షేక్ హాజీ ఘన విజయం

అత్యధిక మెజార్టీతో అధ్యక్షులుగా ఎన్నిక

జడ్చర్ల, జనవరి 18 (మనఊరు ప్రతినిధి): ఇటీవల నిర్వహించిన ఆటో యూనియన్ ఎన్నికల్లో షేక్ హాజీ అత్యధిక మెజార్టీతో ఘన విజయం సాధించి యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు, ఆటో డ్రైవర్లు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల ముందు నుంచి షేక్ హాజీ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేపట్టిన సేవా కార్యక్రమాలు, వారి సమస్యల పరిష్కారంలో చూపిన చిత్తశుద్ధే ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని సభ్యులు పేర్కొన్నారు. ఆయన నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఆటో డ్రైవర్ల హక్కుల పరిరక్షణకు ముందుండాలని కోరారు. విజయం అనంతరం షేక్ హాజీ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రతి ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యూనియన్ అభివృద్ధి, డ్రైవర్ల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అటో యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post