ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
జడ్చర్ల రూరల్, ఫిబ్రవరి 28 (మనఊరు న్యూస్): జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మండలంలోని ఆలూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సైన్స్ ఉత్సవాలను శుక్రవారం నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్, క్విజ్, సైన్స్ ప్రయోగాల ప్రదర్శన, ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ అంటే విజ్ఞానమని, సైన్స్ లేనిదే ఏ పని జరగదు అని, వంద సంవత్సరాల క్రితం మానవ జీవితం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉందో చూస్తే .. సైన్స్ వల్ల ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలిసిపోతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు హైమావతి, సుధాకర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు షరిఫ్, అబ్దుల్ అలీం, హరిహరన్, సోమ్లా నాయక్, సంధ్య, మంజుల, నిర్మల పాల్గొన్నారు.