ఘనంగా వడ్డెర సత్రంలో అన్నదానం
శ్రీశైలం, ఫిబ్రవరి 27 (మనఊరు న్యూస్): శ్రీశైలంలో అఖిలభారత వడ్డె రాజుల అన్నదాన సత్రంలో భక్తులకు , శివ స్వాములకు , వడ్డెర సమాజానికి నిత్య అన్నదానం చేశారు. ప్రతిరోజు దాదాపు 5వేల మంది నుంచి పదివేల మంది వరకు అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమం రాములు సహకారంతో శివరాత్రి పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమ నిర్వహణ సత్రం కమిటీ చైర్మన్ జెడ్పిటి రాములు, అధ్యక్షులు జె. సత్యనారాయణరాజు, చెల్లామద్దిలేటి, కర్నూలు శ్రీనివాసులు, బత్తుల సంజీవరాయుడు, జూటూరు ఈశ్వర్, తిరుపతయ్య, నంద్యాల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, చంద్ర, సత్రం మేనేజర్లు రవి, మల్లికార్జున, రాము, సత్రం సిబ్బంది ఉన్నారు.