శివనామస్మరణతో.... మనశ్శాంతి, ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది...

 శివనామస్మరణతో.... మనశ్శాంతి, ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది...

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి..

మహాశివరాత్రి పర్వదిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, సతీమణి లక్ష్మీ నవీన్ రెడ్డి ప్రత్యేక పూజలు..

శ్రీ రామలింగ దేవాలయంలో లింగమూర్తికి అభిషేకం చేసిన అనంతరం శ్రీ పార్వతి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు* *ఎమ్మెల్సీ దంపతులు..

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 26 (మనఊరు న్యూస్): శివ నామస్మరణతో ఆధ్యాత్మిక శుద్ధి,


మనశ్శాంతి కలుగుతుందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫరూక్ నగర్ మండలం రామేశ్వరం లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి అభిషేకం శ్రీ పార్వతి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు.హిందూ సంస్కృతి సంప్రదాయాలలో మహాశివరాత్రి పర్వదినానికి ప్రత్యేకత ఉందని, ఈ రోజున శివనామ స్మరణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. శివుడు అంటేనే జ్ఞాన దయ స్వరూపుడని ప్రత్యేక పర్వదినం రోజున పరమేశ్వరుని కొలుస్తే మంచి జరుగుతుందని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మోసవాణి ప్రత్యేక అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని, సకలజనులు జాతర ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపను పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో తమ జీవన విధానాలు సాగించాలని శ్రీ రామలింగేశ్వరుడు ని కోరుకున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన వసతులు కల్పించాలని, పోలీస్ బందోబస్తు స్థాయిలో నిర్వహించాలని. కార్యక్రమంలో మామిడిపల్లి మాజీ ఎంపీటీసీ కాట్న మాధవి రవీందర్ రాయికల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మరియు జనార్దన్ గౌడ్,మాసగళ్ల యాదయ్య, వెంకటేష్ విష్ణు గౌడ్,రామేశ్వరం గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు,యాదయ్య మరియు బిఆర్ఎస్ యువ నాయకులు దినేష్,శివా చారి,సుధీర్,గుట్ట రాజు,అనుమరి రాజు,తదితరులు ఉంటాయి.

Previous Post Next Post