బొమ్మరిల్లు కట్టి గృహప్రవేశం చేసిన తాత, అమ్మమ్మలు

 మనవరాలి కోరికే పండుగ ఆనందం… 

బొమ్మరిల్లు కట్టి గృహప్రవేశం చేసిన తాత, అమ్మమ్మలు

సంక్రాంతికి బొమ్మరిల్లు… 

మట్టి బొమ్మలతో మళ్లీ బతికిన మన సంస్కృతి

మనవరాలి మాటకు విలువ… 

వెల్దండలో వినూత్న గృహప్రవేశం

ఫోన్‌ల కాలంలో మట్టి బొమ్మల పండుగ… 

తాత, అమ్మమ్మల ఆదర్శం

కల్వకుర్తి, వెల్దండ, జనవరి 24 (మనఊరు ప్రతినిధి):మ నవరాలి కోరికను ఆనందంగా తీర్చేందుకు తాత–అమ్మమ్మలు చేసిన ప్రయత్నం వెల్దండ మండల కేంద్రంలో అందరినీ ఆకట్టుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రానికి చెందిన బొద్దాం సుభాన్ రెడ్డి, సూర్యకళ దంపతుల మనవరాలు అరణ్య రెడ్డి “సంక్రాంతి పండుగకు మీ ఇంటికి రావాలంటే నాకు బొమ్మరిల్లు కట్టి గృహప్రవేశం చేస్తేనే వస్తాను” అంటూ ముద్దుగా అడగడంతో, ఆ చిన్నారి కోరికను తీరుస్తూ తాత–అమ్మమ్మలు రెండు రోజుల పాటు శ్రమించి మట్టి బొమ్మలతో బొమ్మరిల్లు నిర్మించారు. శిల్పారామంలో ఉండే విధంగా ఆకర్షణీయంగా రూపొందించిన బొమ్మరిల్లుకు నూతన గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని వారిని ఆహ్వానించి, నిజమైన గృహప్రవేశంలానే పాలు పొంగించడం, భక్ష్యాలు, స్వీట్లు వడ్డించడం వంటి సంప్రదాయాలను పాటించారు. రంగురంగుల అలంకరణలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడంతో చూసినవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా తాత, అమ్మమ్మలు మాట్లాడుతూ ఈ రోజుల్లో పిల్లలు కంప్యూటర్‌లు, మొబైల్ ఫోన్‌లకే పరిమితమవుతున్నారు. మేము చిన్నప్పుడు ఆడుకున్న మట్టి బొమ్మలు, మన తెలుగు సంప్రదాయాల గురించి మన మనుమండ్లకు, మనవరాళ్లకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డుకు చెందిన మల్లేశ్వరి–రంగనాథ దంపతులు, కాలనీవాసులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి పసుపు–కుంకుమలు అందజేశారు. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ చూడలేదని, ఇది ఎంతో ఆనందాన్ని కలిగించిందని కాలనీవాసులు తెలిపారు.











Previous Post Next Post