కనుల పండుగగా పాలెం వెంకన్న బ్రహ్మోత్సవాలు...

 శోభాయానంగా, కనుల పండుగగా పాలెం వెంకన్న బ్రహ్మోత్సవాలు...

వేలాది భక్తులకు స్వామివారి దర్శనం...

ఆలయంలో భక్తులచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు...

భక్తులతో కిటకిటలాడుతున్న పాలెం వెంకన్న జాతర....

మాజీ దేవాలయ చైర్మన్ జున్నా శేఖర్ రెడ్డి భక్తులకు అన్నప్రసాద పంపిణీ...

బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో వెలిసిన శ్రీ అల్మేరల్ మంగ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శోభయానంగాజరుగుతున్నాయి.రథసప్తమి సందర్భంగా ఆదివారం నాడు వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయంలో భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలుసామూహికంగా నిర్వహించారు.భక్తులకు ఆలయ మాజీ చైర్మన్ జున్నా శేఖర్ రెడ్డి బ్రహ్మోత్సవాలకు అన్ని రోజులు అన్న ప్రసాద పంపిణీ నిర్వహిస్తున్నారు. ఆలయంలో తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక పూజలు,రథసప్తమి సందర్భంగా ప్రత్యేక హోమాలు వేదమంత్రచరణల మధ్య నిర్వహించారు.భక్తులు స్వామి వారికి ముడుపులు, తులాభారం,సమర్పించారు. స్వామివారికి వివిధ కైంకర్యాలు,వివిధ వాహన సేవలు ప్రత్యేకంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మనుసాని విష్ణుమూర్తి, కార్య నిర్వహణ అధికారి సిహెచ్ రంగారావు,ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గాడి సురేందర్,మాజీ మండల అధ్యక్షులు పి.శ్రీనివాస్ గౌడ్, గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు, దేవాలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజాచార్యులు, అర్చకులుశుక్లా,జయంత్ ,అరవింద్,చక్రపాణి,ఆలయ సిబ్బంది ఆర్.శివకుమార్ బాబయ్య,వివిధ జిల్లాలు, వివిధ ప్రాంతాల నుండి భక్తులు మహిళలు చిన్నారులు వేలాదిగా పాల్గొన్నారు.పాల్గొన్నారు






Previous Post Next Post