టైలర్ లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
ఎర్రగుంట్ల, ఫిబ్రవరి 28 (మనఊరు న్యూస్): టైలర్స్ డే సందర్బంగా యర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలిలో శుక్రవారం అంతా హాజరై టైలర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి కార్మిక నాయకులు యస్. రాధాక్రిష్ణ సంఘం అధ్యక్షులు సి . జి. విరాంజనేయులు, ఉపాధ్యాక్షులు రఘురామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి టైలర్ శివ లు మాట్లాడుతూ రేడిమెట్ వస్త్రాల కారణంగా టైలర్ల ఉపాధి దెబ్బతితుందని పండుగల సందర్బంలో తప్ప మిగిలిన సమయాల్లో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకోని టైలర్ల ఉపాధి అవకాశాలు మేరుగు పడే విదంగా చర్యలు తీసుకోవాలని, గుర్తింపు కలిగిన వారికి సబ్సిడీ కుట్టు మిషన్లు, జీగ్ జాగ్ మిషన్లు అందించాలని కుట్టు మిషన్ సెంటర్లు ఏర్పాటు చేసి టైలర్ల వృత్తిని పెంపొందించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదు కోవాలని వారు ఈసందర్బంగా స్థానిక ఎమ్మెల్యే ని, ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాబు, బ్రహ్మం నన్నే, రవి, కాశిం, ప్రతాప్, సుబ్బారెడ్డి, పెద్ద నన్నే, రియాజ్, రపి, తదితరులు పాల్గొన్నారు.