శివ మార్కండేయ దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి

 శివ మార్కండేయ దేవాలయంలో ఘనంగా మహాశివరాత్రి




మహబూబ్ నగర్, ఫిబ్రవరి 26 (మనఊరు న్యూస్): జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండపై వెలసిన శివ మార్కండేయ దేవాలయంలో శివరాత్రి సందర్భంగా ఉదయం గణపతి పూజ, అర్చన, పంచామృత అభిషేకము, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, భజన రాత్రి లింగోద్భవ కాలంలో రుద్రాభిషేకం శివ పార్వతుల కళ్యాణము నిర్వహించబడినాయి. 

శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారు మ్రోగినవి స్వామివారి కి మంగళ నీరాజనములు భక్తితో సమర్పించిరి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు. తీర్థప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజ్జా శంకర్, వెంకటేష్, పానుగంటి బాలరాజు, మేకల శ్రీనివాసులు, పల్నాటి బాలరాజు, దాసు వెంకటేశు, బిజ్జా శంకరు, అప్పం అనంతరాములు, కడుదాసు సత్యనారాయణ,కోడి సుకుమార్, వెంకటేశు, సూర్య ప్రతాప్, పల్లాటి నాగ స్వామి, కోడి రాజశేఖర్, కొంగరి సత్యనారాయణ, పల్నాటి బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post