పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 27 (మనఊరు న్యూస్): విద్యార్థులు మంచిగా చదువుకొని పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2డి, 3డి యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను ఉచితంగా అందజేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం గురువారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువును నిర్లక్ష్యం చేయవద్దు అని ఆయన చెప్పారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ సమయం చాలా విలువైనదని ప్రతిఒక్కరూ టైమ్ మేనేజ్మెంట్ పాటించి, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిఎంఓ బాలు యాదవ్, నాయకులు సిహెచ్ జ్యోతి, సిహెచ్ మంజుల,రామస్వామి, శివశంకర్ , రవి కుమార్, శ్రీనివాస్ గౌడ్, తిరుపతయ్య యాదవ్ , మురళి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ కుమారి , విద్యార్థులు, ఉపాధ్యాయులుు, తదితరులు పాల్గొన్నారు.