ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి
కల్వకుర్తి, ఫిబ్రవరి 26 (మనఊరు న్యూస్): ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అమనగల్ మండలం అయ్యసాగర్ శ్రీ త్రిపురాంతకేశ్వర - వీరభద్రస్వామి వారి దేవాలయంలో స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికి మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకంక్షలు తెలియజేస్తూ పరమశివుని ఆశీస్సులతో ప్రజలందరు ఎల్లపుడు సుఖసంతోషాతో ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.