మనఊరు దినపత్రిక పత్రిక 2025 క్యాలెండర్ ఆవిష్కరణ
జడ్చర్ల రూరల్, మార్చి 6 (మనఊరు న్యూస్): పత్రిక రంగంలో మంచి గుర్తింపు పొందిన మనఊరు దినపత్రిక 2025 క్యాలెండర్ ను గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐలు కమలాకర్, నాగార్జునగౌడ్ లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అనతి కాలం లో మనఊరు పత్రిక అందరికి అందుబాటులోకి వచ్చి పాఠకుల మన్ననలను పొందిందని, ఎప్పటికప్పుడు వార్తలను ప్రజలకు,అధికారులకు చేరవేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మనఊరు దినపత్రిక జిల్లా ఇంచార్జి రాసోజు వేణుగోపాలాచారి, నాయకులు రాఘవేందర్ గౌడ్, విలేకరులు పాల్గొన్నారు.