విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం

 విజయవంతమైన ఉచిత వైద్య శిబిరం




అశ్వారావుపేట, మార్చి 6 మనఊరు న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు దివాకర్, హోమియో వైద్యులు దీపికలు అన్నారు. నియోజకవర్గంలోని దమ్మపేట మండల పరిధిలో గల ఎజెన్సీ ప్రాంతమైన పూసుకుంట గ్రామ పంచాయితీ పరిధిలో గల కట్కూరు, కొత్త గ్రామపాంతాలను కలుపుతూ కమ్యూనిటీ భవనంలో దమ్మపేట మండల జెఎసి విలేకరుల బృందం ఆధ్వర్యంలో గురువారం ఆదివాసీ గిరిజనులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి వచ్చి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే ప్రజలందరు చికిత్సలు చేపించుకోవాలన్నారు. వైదద్యుల సూచనలు తప్పకుండ పాటించి మందులు వాడితే వ్యాది నయం అవుతుందని వారు అన్నారు. వివిధ రకాల విష జ్వరాలకు, వృద్ధాప్య నొప్పులకు, చిన్నారులకు నులిపురుగుల నివారణకు మందులు అవేకాకుండా హోమోయోతీ మందులు ఇవ్వడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్‌లో పాల్గొన్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎన్నోసార్లు ఇక్కడ హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది, కానీ ఈ హోమియో, హెల్త్ క్యాంప్ లో గ్రామాలకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని వైద్యసేవలను వినియోగించుకున్నారని ఆయన అన్నారు. సీనియర్ రిపోర్టర్ నవీన్, సీనియర్ రిపోర్టర్ నూనె సత్యనారాయణలు మాట్లాడుతూ ఈ హెల్త్ క్యాంప్ ను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలేకర్ల జేఈసీ సభ్యులు ఎస్.సాయికుమార్, పి.రమేష్, జే.నాగరాజు, చిరు, సంతోష్, మంగరాజు, బుల్లా శ్రీను, నాగేంద్ర, అనిల్, గోపి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post