పోదేం వీరయ్యకి ఎమ్మెల్సీ ఇవ్వాలి

 పోదేం వీరయ్యకి ఎమ్మెల్సీ ఇవ్వాలి 

పేట కాంగ్రెస్ నాయకులు డిమాండ్

అశ్వారావుపేట, మార్చి 5 (మనఊరు న్యూస్): ఆపద కాలంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉండి కార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీని కాపాడిన వ్యక్తి, భద్రాద్రి కొత్తగూడెం డిసిసి అధ్యక్షులు పోదేం వీరయ్యకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మండల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డిమాండ్ చేశారు. పోదేం వీరయ్యకి రెండు సార్లు డిసిసి అధ్యక్షులుగా ఉంటూ, పార్టీ కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎంతమంది పార్టీ మారిన పార్టీయే తమ ప్రాణంగా కార్యకర్తల కోసం ప్రజల కోసం అహర్నిశలు పనిచేసే మహనీయుడు వీరయ్య అని అన్నారు. గత పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన అన్నా అంటే నేనున్నానంటూ ప్రజలను కాపాడుతూ వస్తున్న వ్యక్తికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలంటే వారికి తప్పనిసరిగా ఒక మంచి అత్యున్నత స్థానాన్ని పార్టీ కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపాలంటే వీరయ్యకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి, మంత్రివర్గం పునరాలోచించి క్రమశిక్షణ కలిగిన నాయకుడికి సరైన గౌరవం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసరావు, నియోజకవర్గం కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బండారు మహేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కూరం సింహాచలం, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ తగరం రాజేష్, అనంతరం మాజీ సర్పంచ్ దాసరి నాగేంద్ర, మండల మాజీ కో ఆప్షన్ నెంబర్ పాషా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ బషీర్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నరదల మణికంఠ, గండికోట రాంబాబు, మాడి గంగరాజు, పేరం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post