విద్యార్థులకు స్టడీ మెటీరియల్, సైకిల్ల పంపిణీ

 విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ సైకిల్ పంపిణీ 

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి

అడ్డాకుల, మార్చి 5 (మనఊరు న్యూస్): విద్యార్థులు ఉత్తమ చదువులతో అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని పొన్నకల్ గ్రామంలో పదో తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవాసమితి ప్రత్యేకంగా తయారు చేసిన స్టడీ మెటీరియల్, సైకిల్లను పంపిణీ ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి అలవాట్లను పాటిస్తూ చక్కగా చదువుకోవాలని, చదువులతో పాటు మంచి క్రీడలు, చక్కటి హాబీస్‌ అలవర్చుకోవాలని, ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని, సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలిచి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దోనూర్ నాగార్జునరెడ్డి, దోనూర్ లింగారెడ్డి, దోనూర్ హేమవర్ధన్ రెడ్డి, గుడిబండ మాజీ ఎంపిటిసి శకుంతల నాగిరెడ్డి, జగదీశ్వర్, దశరథ్ రెడ్డి, వేగనాథ్, విజయ మోహన్ రెడ్డి, శరత్ కుమార్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post