భూమికోసం తాహసిల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టిన మహిళ
బాలానగర్, మార్చి 10 (మనఊరు న్యూస్): బాలానగర్ మండల కేంద్రని తాహసిల్దార్ కార్యాలయం ముందు బాలానగర్ గ్రామానికి చెందిన మహిళా రైతు పల్నాటి సులోచనదేవి సోమవారం కార్యాలయం ముందు హాజరు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి మొత్తం నాలుగు ఎకరాలు ఉండగా అందులో ఒక ఎకరం ప్రైవేట్ రోడ్లు వేసి కబ్జాకు గురి చేశారన్నారు. మరో ఎకర చుట్టూ ఉన్న రైతులు కబ్జా తయారు చేశారు. కబ్జాదారుల కబంద హస్తాల నుంచి తన భూమిని కాపాడి తనకు స్వాధీనం చేసుకున్నట్లు ఆమె పలుమార్లు విన్నవించుకున్నట్లు చెప్పారు. తమ ల్యాండ్ సర్వే చేయడానికి సంబంధించిన సర్వే అధికారులకు పలుమార్లు ఫీజు కట్టి వినతి పత్రాలు అందజేయడం జరిగింది. అయితే సర్వే అధికారులు భూమి మోకాపైకి వచ్చి సర్వే చేయకుండా ఎటు తేల్చకుండా వెళ్ళిపోవడం జరిగింది. దీని అంతటికి బలమైన కారణం అధికారులు. అధికారులు పనిచేయక పని చేయలేకపోవడమే ప్రధాన కారణమని ఆమె నిజాయితీ. తనకు కుమారులు ఉన్నారని వారికి ఎలాంటి ఉద్యోగాలు లేనందున భూమిపై ఇద్దరు వ్యవసాయం చేసుకొని జీవించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. నాలుగు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు కబ్జాకు గురి కావడంతో తాము ఎలా జీవించాలో తెలియక తీవ్ర మనోవేదన చెందుతున్నామని ఆమె తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు భూమిని సర్వే చేసి కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి నా భూమి నాకు ఇప్పించాలని ఆమె కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించి తన సమస్యను పరిష్కరించి తన కుటుంబాన్ని కాపాడాలని ఆమె కోరారు.

