పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి
ఎస్టీయూ రాష్ట అధ్యక్షులు పర్వత్ రెడ్డి
నాగర్ కర్నూల్, మార్చి 10 (మనఊరు న్యూస్): స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ప్రథమ కార్యవర్గ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సమావేశానికి ఏస్.మురళి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు యం.పర్వత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ రావు సంఘ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించరు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏం.పర్వత్ రెడ్డి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ మేరకు వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని,బకాయి డీఏలను ప్రకటించి, పి.ఆర్సి నివేదికను తెప్పించాలని వారు డిమాండ్ చేశారు. బకాయిలను ఈ- కుబేరులో ఉన్న వాటిని మార్చి 2025 లోగా సంబంధిత ఉద్యోగులకు వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2008 డీఎస్సీలో సెలెక్ట్ అయి ఇటీవల ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నూతన ఉపాధ్యాయులను సంఘంలోకి ఆహ్వానించి వారిని పూలు, శాలువలతో ఘనంగా సన్మానించరు.ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వడ్డే హనుమంత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోకల సతీష్, అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మారావు,కే.రమేశ్ కన్వీనర్స్ అనిల్ కుమార్ రెడ్డి,ప్రభాకర్,రఘురాం రెడ్డి,జమీల్ అహ్మద్, వరప్రసాద్,మధుసూదన్ రెడ్డి, బాలస్వామి, కర్ణాకర్ రెడ్డి వివిద మండలాలకు చెందిన ఎస్టీయూ అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
