ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడిని పరామర్శించిన మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి
అడ్డాకుల, మార్చి 15 (మనఊరు న్యూస్): మండల కేంద్రానికి చెందిన ప్రెస్ రిపోర్టర్ కార్తిక్ యాదవ్ సోదరుడు నాగరాజు శుక్రవారం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా జానంపేట దగ్గర కారు ఢీ కొట్టిన ఘటనలో అతనికి తలకు, కాలుకు తీవ్ర గాయాలై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడిని శనివారం అడ్డాకుల మాజీ జెడ్పిటిసి నల్లమద్ది రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. ఆయన వైద్యుల ఛాంబర్ లో కలిసి యువకుని చికిత్స సర్జరీ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. వైద్యులను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని కోరారు. యువకుని కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించి ఆర్థిక సహాయం అందజేశారు. యువకునికి చికిత్స త్వరగా నయమై సంపూర్ణ ఆరోగ్యముతో త్వరగా కోలుకోవాలని మాజీ జెడ్పిటిసి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి చంద్రయ్య, ఎలుసరి బాలరాజు, డి. శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
