కానిస్టేబుల్ ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
సత్తుపల్లి, మార్చి 15 (మనఊరు న్యూస్): సత్తుపల్లి పట్టణంలోని బట్టలు షాప్ రోడ్ - ఇటీవల మెట్ట ఆంజనేయ స్వామి గుడి వద్ద రాత్రి దొంగతనం జరగడంతో ఆదొంగని పట్టుకునే క్రమంలో తీవ్ర గాయాలు ఐనా ఐడి పార్టీ సత్తుపల్లి పోలీస్ కానిస్టేబుల్ నరేష్ ని కలుసుకొని వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని పరామర్శించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, రాష్ట్ర యువ నాయకులు తుమ్మల యుగంధర్, సత్తుపల్లి సీఐ ద్వారా జరిగిన సంఘటనను తెలుసుకున్న అనంతరం ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకున్న కానిస్టేబుల్ నరేష్ ని ప్రత్యేకంగా అభినందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సత్తుపల్లి సీఐ. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి, మాజీ కౌన్సిలర్ దూదిపాలా రాంబాబు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, మలిరెడ్డి మురళిరెడ్డి, కమల్ పాషా, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
