మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం
దేవరకద్ర, మార్చి 10 (మనఊరు న్యూస్): మండలంలోని లక్ష్మీపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల హెచ్ఎం కె కె శ్రీనివాస్ అధ్యక్షతన ఉన్నత , ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఆస్రఖాద్రి (ఎస్ఎ ఆంగ్లం), కావాలి సుజాత (ఎస్ఎ తెలుగు), బిజిలి విజయలక్ష్మీ (ఎస్ జి టి) విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్ యం కెకె శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సమాజాభివృద్ధికి మహిళలు మార్గదర్శకులని అన్నారు. ప్రాథమిక పాఠశాల ఇంచార్జీ హెచ్ ఎం అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి మహిళలకు విశిష్ట స్థానం ఉందని అన్నారు. సమాజంలో మహిళల పాత్ర మహోన్నత మైనదని అన్నారు. మంత్ర, యంత్ర శక్తి కంటే మహిళా శక్తి గొప్పదన్నారు. సన్మాన గ్రహీతలు అస్రఖాద్రి, కావాలి సుజాత, బిజిలి విజయ లక్ష్మీ లు మాట్లాడుతూ మహిళలు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ప్రతి మహిళా చదువుకొని సమాజాభివృద్ధికి స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు కోటకద్ర మురళీధర్, కమల్ రాజ్ , మదన్ మోహన్, నాగేశ్వర్ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
