వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

 వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి 

ఎండవలన కలిగే అనారోగ్యాలను నివారించాలి

 పి. అమరేందర్  

అదనపు కలెక్టర్ (రెవెన్యూ)



నాగర్ కర్నూల్, మార్చి 10 (మనఊరు న్యూస్): జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎండవలన కలిగే అనారోగ్యాలను ముందస్తు జాగ్రత్తలు పాటించడం వల్ల నివారించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ పి. అమరేందర్ జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో తెలియజేశారు. 

ఎండవలన కలిగే అనారోగ్యాల నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. ఎండవలన 

శిశువులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వయోవృద్ధులు అనారోగ్యానికి గురవుతారు కావున వీరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు. ఎండాకాలంలో దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగండి దాహం డిహైడ్రేషన్ కి మంచి సూచిక కాదు. బయటికి వెళ్ళేటప్పుడు తమ వెంట తప్పకుండా తాగు నీరు తీసుకెళ్లాలి. ఇంట్లో ఉండే మజ్జిగ ,నిమ్మరసం, అంబలి ఇలాంటి పానీయాలను తీసుకోవాలి. వీలైతే సీజనల్ ఫ్రూట్స్ అయినా పుచ్చకాయ, కర్బూజా ఆరంజ్, దోసకాయ ఇలాంటి పండ్లు కాయగూరలు తీసుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు తలపై టోపీ గాని, తెల్లని వస్త్రం కానీ కప్పుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలో బయటికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఉపాధి హామీ పనికి వెళ్లేవారు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. 

జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వి స్వరాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ అన్ని ఆరోగ్యప కేంద్రాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తల దగ్గర ఓఆర్ఎస్ పాకెట్లు సిద్ధంగా ఉంచామని తెలియజేశారు. ఆల్కహాల్ టీ కాఫీ, కార్బోనేటెడ్ శీతలపానీయాలు లేదా పెద్ద మొత్తంలో చక్కెరతో కూడిన పానీయాలను నివారించాలి. చెప్పులు లేకుండా బయటకు వెళ్ళవద్దు. మన నివాసానికి ఎండ తగిలి ప్రాంతంలో కిటికీలు తలుపులు మూసి ఉంచాలి, సాయంత్రం తర్వాత తెరవాలి. దీనివలన ఎండ వేడిమి దిగులు కాకుండా నివారించవచ్చును. ఎవరికైనా ఎందువలన, తీవ్రమైన తలనొప్పి, జ్వరము వికారము లేదా వాంతులు , తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలి. 

ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యుత్తు, విద్యాశాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయ అధిపతులు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ శివ, డిపిఒ రేనయ్య, ఎపిడమాలజిస్ట్ ప్రవల్లిక, పర్యవేక్షణ సిబ్బంది ఆర్ శ్రీనివాసులు, విజయ్ కుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post