సమకాలీన పరిజ్ఞానం అవసరం
జడ్చర్ల రూరల్, మార్చి 13 (మనఊరు న్యూస్): ప్రవేశ పరీక్షలల్లో రాణించాలంటే సమయపాల
న ఎంతో ముఖ్యమనీ సీనియర్ సూపరింటెండెంట్, రాష్ట్ర సి ఎస్ సి కోర్టు హైదరాబాద్, సామాజిక నాయకురాలు పీవీపీ అంజలి కుమారి అన్నారు.శుక్రవారం పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిలలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పష్టమైన లక్యం, సాదించాలన్న తపన, భిన్నమైన ఆలోచనలు ఉంటే అనుకున్నది అనుకున్నట్లు సాధించవచ్చున్నారు. ముందు చదువు గొప్పతనం ఏమిటో గుర్తించుకో వారన్నారు. ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటు బాషా నైపుణ్యాలు, బావ వక్తీ కరణ నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ డిజి స్కూల్ ప్రిన్సిపాల్ వేమూరి రాధారాణి మాట్లాడుతూ విద్యార్థులు అంకిత భావం, పట్టుదలతో కృషి చేస్తే ఏరంగంలోనైనా విజయం సాధించవచ్చని తెలిపారు. లక్యం లేకుండా గమ్యం చేరుకోలేమన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్ణయించుకొని దిన్ని సాదించెందుకు ప్రత్యేక ప్రణాళికతో చదవాలన్నారు. విద్యార్ధుల్లో ప్రతిభ ఉన్న, క్రమశిక్షణతో సాధన చేస్తేనే ఇశించిన ఫలితం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మన సేవా సమితి అధ్యక్షులు వేణుగోపాల్, తభస్మ్, విద్యార్థులు పాల్గొన్నారు.







