నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలి
ఏయంఓ దుంకుడు శ్రీనివాస్
జడ్చర్ల రూరల్, మార్చి 7 (మనఊరు న్యూస్): విద్యార్థులు తమ పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి దుంకుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం లోని ఉదండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 'స్వయం పరిపాలనా దినోత్సవానికి' ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, వివిధ ప్రతిభాపాటవ పోటీల్లో పాల్గొనడం ద్వారా స్వీయ క్రమశిక్షణ అలవడుతుందనీ, సంపూర్ణ మూర్తిమత్వ వికాసం చెందగలుగుతారనీ అన్నారు. స్వయం పరిపాలనా దినోత్సవంలో డీఈఓగా భానుప్రసాద్, ఎంఈఓగా హరీష్, కాంప్లెక్స్ హెచ్చెమ్ గా భానుతేజ, పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా రమ్య, వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా విద్యార్థులు చాలా చక్కని ప్రదర్శన కనబరచారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీయంఓ బాలుయాదవ్, జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సుధాకర్ రెడ్డి, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ అధ్యక్షులు పుష్ప, ఉపాధ్యాయులు సురేంద్రనాథ్, పాండునాయక్, రాందాస్, రామేశ్వరి, రమాదేవి, హిమబిందు, ప్రియదర్శిని, అర్చన, రాధిక, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.