ఇంటర్ విద్యార్థులకు ఆటో వసతి కల్పించిన దయాకర్ గౌడ్
మూసాపేట, మార్చి 7 (మనఊరు న్యూస్): మహాబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని చక్రపూర్, కనుకపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులకు సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయడానికి ఇబ్బందులకు గురవుతున్నారని, ఇంటర్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలు బాగా రాయాలని గ్రామానికి చెందిన దయాకర్ గౌడ్ ఆటో ఏర్పాటు చేశారు. ఆయన సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయన సమకూర్చిన సొంత ఖర్చుతో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న విద్యార్థులకు ప్రత్యేక ఆటో వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.