బిసి గురుకుల పాఠశాల ఘనంగా మహిళా దినోత్సవం
మహబూబ్ నగర్, మార్చి 8 (మనఊరు న్యూస్): మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయాలని బిసి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్పందన పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హన్వాడ మండలంలోని బిసి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ స్పందన కేకు కట్ చేసి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు లేనిదే మనగడ లేదని, మహిళలే సృష్టికి మూలం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయరాలులు పాల్గొన్నారు.

