మహిళా శక్తి... జాతీయ శక్తి...
వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ బి. శ్రీనివాస్ గౌడ్
వనపర్తి, మార్చి 8 (మనఊరు న్యూస్): మహిళల శక్తిని గౌరవించుతూ, ప్రోత్సహిస్తూ ముందుకు సాగుదాం మని వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, సమాజానికి అహర్నిశలు సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి సిస్టర్స్ ని, మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కృషి, ధైర్యం, నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మహిళలు, భూగర్భంలోని మైనింగ్ సెక్టార్లలో మొదులుకోని అంతరిక్షంలో స్పెస్ వాక్ వరకు అన్ని రంగాలలో రానిస్తున్నారని ఉన్నారని అన్నారు. జగతికి మూలం మహిళ అని , మహిళలకు నిత్యం అండగా ఉంటూ మహిళలను గౌరవించుకుందాం అని అన్నారు. మహిళల సాధికారత జరిగినప్పుడు సమాజం అద్భుతంగా అభివృధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాపర్ల రాంరెడ్డి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
