భగత్ సింగ్ కాలనీలో ఘనంగా హోలీ సంబరాలు
షాద్ నగర్, మార్చి 13 (మనఊరు న్యూస్): హోలీ పర్వదినం పురస్కరించుకొని షాద్ నగర్ భగత్ సింగ్ కాలనీ లో శుక్రవారం హోలి సంబరాలు కాలనీ మహిళలు పాల్గొని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ కాలనీ మహిళా నాయకురాలు సునిత మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ అన్ని కార్యక్రమాలు ఉత్సవాలు సంయుక్తంగా చేసుకుంటేనే పండుగ వాతావరణం అన్నారు. కాలనీలో చిన్నారులు పెద్దలు మహిళలు హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వసంత, మంజువాణి, నవనీత, జ్యోతి, మంజుల, జీవిత, సంతోష, మాధవి, మహిళలు పాల్గొన్నారు.


