ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం*

గంట్లవెల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ ధ్వంసం*  

 *షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు*




షాద్ నగర్, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): ఆకతాయి అల్లరిముకల చేతలకు హద్దు అదుపు లేకుండా పోయింది.. విద్యార్థులకు చదువులు నేర్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే సమాజ దేవాలయం బడి అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ప్రభుత్వ బడిలో అరాచకం సృష్టించిన అల్లరిమూకలు ఫర్నిచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిన్న గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభుత్వ సెలవు మంజూరు అయింది. దీంతో పాఠశాలలో ఎవరూ లేని సమయంలో కొందరు ఆకతాయిలు అల్లరి మూకలు పాఠశాలలో చొరబడి ఫ్యాన్లను ధ్వంసం చేశారు. అదేవిధంగా పాఠశాలల్లో ఉన్న అల్మారీలను పగులగొట్టి అందులో వస్తువులను చిందరవందర చేసి పడేశారు. ఎలక్ట్రిక్ వైర్లు తదితర పైపులను కూడా ధ్వంసం చేసి బయట పడేశారు. పాఠశాల తలుపులను తాలాన్ని పగలగొట్టారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు చదువుకునే బడి పట్ల ఇలా వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయమై గ్రామానికి చెందిన అనిల్ మీడియాతో మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమని దౌర్భాగ్యం అని ఇలాంటి పనులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా దీనిపై ఫిర్యాదు చేసినట్లు గ్రామ యువకుడు అనిల్ పేర్కొన్నారు..

Previous Post Next Post