పోషక విలువలతో కూడిన ఆహారాన్నే తీసుకోవాలి…
డిడబ్యూవో జరీనా
జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): గర్బిణీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్నే తీసుకోవాలని డిడబ్యూవో జరీనా అన్నారు. శనివారం పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్ సమావేశంలో పోషణ మాసంలో భాగంగా ఏర్పాటు చేసిన పోషణ అభియాన్ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ పోషణమాసం ప్రతిజ్ఞ చేయించారు. గర్భిణీలు, బాలింతలు, 3నుంచి 6ఏండ్ల లోపు చిన్నారులు తప్పక పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పోషణమాసం ప్రాముఖ్యతను తెలియజేస్తూ కూరగాయాలు, పండ్లు, పప్పుదాన్యాలు, గుడ్లు వంటి వాటితో చేసిన అలంకరణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడి కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆకుకూరలు కూరగాయలు తింటే రక్తహీనతనం నిర్వారించవచ్చునని అన్నారు. పోషణ మాసం ప్రాముఖ్యతను తెలియజేశారు. మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క మహిళలు రాగులు, సజ్జలు, కొర్రలు, మొదలగు త్రుణ ధాన్యాలలో ఐరన్ పిండిపదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, సీడిపివో శోభారాణి, వివిధ శాఖల అధికారులు, సూపర్ వైజర్లు, అంగన్ వాడి టిచర్లు, తదితరులు పాల్గొన్నారు.