శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల,తైలా అభిషేక పూజలు...

 *శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల,తైలా అభిషేక పూజలు....*

**పరమశివునికి రుద్రాబిషేకలు,అర్చనపూజలు*

*ఈనెల 26న శని త్రయోదశి ప్రత్యేక పూజలు*


బిజినెపల్లి, ఏప్రిల్ 19 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ విశ్వ వాసు సంవత్సరం చైత్రమాసం లో శనివారం నాడు శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానఅర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసం శనేశ్వర స్వామిని పూజించిన ఆరాధించిన పలితం ఉంటున్నది అనంతరం గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే సామూహిక రుద్రాభిషేకపూజలు,అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారుభక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య చేశారు.గణపతి,నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 26న శని త్రయోదశి ఉన్నందున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈనెల 26న శనివారం నాడు శనిత్రయోదశి ఉన్నందున వడ్డేమాన్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు భక్తులకు ఉన్నట్టు తెలిపారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ కమిటీ సభ్యులు కేంచే రాజేష్ ప్రభాకర్, పుల్లయ్య,వీర శేఖర్, శ్రీకాంత్ రెడ్డి,ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post