రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్త

 రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్త


హైదరాబాద్,  మే 31 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయస్సును పెంచింది. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపునకు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపుతో పాటు పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. లక్ష ఉండగా తాజా ఉత్తర్వుల్లో దానిని రూ. 2 లక్షలకు పెంచింది. అలాగే అంగన్వాడీ హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.50 వేల ఉండగా.. దానిని రూ.లక్షకు ప్రభుత్వం పెంచింది. అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు కాగా ఎవరైన వివిధ కారణాలతో 60 ఏళ్లు దాటిన తర్వాత వీఆర్‌ఎస్ తీసుకునే టీచర్లకు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Previous Post Next Post