లక్మినగర్ కాలనీ లో ప్రమాదభరితంగా ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ వైర్
చేతికి అందే ఎత్తులో వైర్లు
భయాందోళనలో ప్రజలు
జడ్చర్ల రూరల్, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): మునిసిపల్ పరిధిలోని లక్మినగర్ కాలనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఎర్తింగ్ వైర్, ప్రమాదకరంగా ఉంది. ఫ్యూజ్ బాక్స్ వైర్లు చేతికి అందేవిధంగా ఉండడంతో ఏక్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాం దోళన చెందుతున్నారు. పలుమార్లు వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో నిప్పురవ్వలు ఎగసి పడుతున్నాయని కాలనివాసులు ఆందోళన చెందుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.