కృష్ణ మంచి మనసున్న కళల పట్ల మక్కువ ఉన్న మహా నేత

 కృష్ణ మంచి మనసున్న కళల పట్ల మక్కువ ఉన్న మహా నేత

ప్రముఖ సామాజికవేత్త అంజనీకుమారి





హైదరాబాద్, జూన్ 22 (మనఊరు ప్రతినిధి): శిఖరం ఆర్ట్స్ థియేటర్స్ అదినేత కృష్ణ మంచి మనసున్న కళల పట్ల మక్కువ ఉన్న మహా నేత అని ప్రముఖ సామాజికవేత్త అంజనీకుమారి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని త్యాగరాజ గానసభ మెయిన్ హాల్ చిక్కడపల్లిలో శిఖరం ఆర్ట్స్ థియేటర్స్... స్వర రమణీయం, సినీ గాన మా నో హారం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఆమె ప్రముఖ గాయకుడు సంగీత దర్శకుడు రమణా రెడ్డికి ఘన సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిఖరం ఆర్ట్స్ థియేటర్ అధినేత శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో సినీ గాన మనోహరo, సినిమా గాన సభ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యముగా ప్రముఖ గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం ప్రియా అభిమాని, శిష్యుడు రమణ రెడ్డికి స్వర సమ్మోహన బిరుదు ప్రధానం చేయడం జరిగినది. సందర్భంగా ప్రముఖ ప్రముఖ గాయని గాయకులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సామాజికవేత్త అంజనీకుమారి మాట్లాడుతూ శిఖరం ఆర్ట్స్ థియేటర్ అధినేత మంచి భావాలు.. అభిరుచులు కలిగిన వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. ఆయన ఆధ్వర్యంలో రమణా రెడ్డికి స్వర సమ్మోహన బిరుదు ప్రధానం చేయడం నేటి గాయని గాయకులకు శుభ పరిమాణము, దాదాపు 30 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో సంగీత సామ్రాజ్యంలో అల్పు ఎరగని బహుదూరపు బాటసారి రమణారెడ్డి, కృష్ణులు మంచి మిత్రులుగా కొనసాగుతున్నారని తెలిపారు. రమణారెడ్డి, బాలు అభిమాని వాళ్ళ పిల్లలకు కూడా పల్లవి, చరణ్ పేరు పెట్టుకోవడమే కాకుండా వాళ్ల పేరుతో సంస్థ స్థాపించి అనేకమంది గాయని గాయకులకు ఒక ప్లాట్ఫారం కల్పించి సమాజానికి కొత్త గాయని గాయకులను పరిచయం చేస్తూ అటు కొత్త వారితో ఇటు పాతవారితో మమేకమై తను ఏర్పరచుకున్న సంగీత ప్రపంచంలో అనేకఅవకాశాలు కల్పిస్తూ నేటి సమాజానికి పరిచయం చేస్తూ ముందుకు కొనసాగుతున్నారు, ఈ బిరుదు 100కి 100శాతం ఆయనకి దక్కటం న్యాయం జరిగిందని తెలిపారు. నేటి సమాజంలో అర్హులైన వ్యక్తులకు అవార్డ్స్ దొరకడం లేదు, ఈ విషయములో కృష్ణ (శిఖరం ఆర్ట్స్) యొక్క గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. శ్రీ లంక లక్ష్మీనారాయణ సభ కార్యక్రమం అధ్యక్షులు మాట్లాడుతూ.. కృష్ణ మంచి మనసున్న కళల పట్ల మక్కువ ఉన్న మహా నేత ఒక ఫోటో గ్రాఫర్ నుంచి థియేటర్ అధినేతగా ఎదుగుతూ ఎంతోమంది కళాకారులకు వారిలో దాగివున్న కళలను ప్రోత్సహిస్తూ ఎంతోమందికి ప్లాట్ఫామ్ కల్పిస్తూ ముందుకు సాగు ఉన్నారు, అని అన్నారు అలాగే మరియొక అతిధి రంగస్థలం నటుడు దామోదర్ నాగేందర్ గారు మాట్లాడుతూ శిఖరం ఆర్ట్స్ థియేటర్ నుండి స్వరసమ్మోహన బిరుదు రమణారెడ్డికి ప్రధానం చేయటం ఒక శుభ సూచకం.. రమణారెడ్డి మంచి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అభిమాని అలాగే సినిమా పాటలు అంటే ఇలా ఉండాలి అని ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి రమణారెడ్డి... ఇలాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు నేటి సమాజంలో ఎదగటం చాలా కష్టం అయినా సరే ఆయన తగ్గేదే లేదు అంటూ ఆయన ఏర్పరచుకున్న సంగీత సామ్రాజ్యంలో ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తూ ముందు కు కొనసాగుతున్నారు, సర సమూహన బిరుదు ప్రధాన ఉత్సవములు మేము కూడా వారి మిత్రులుగా పాల్గొనడం అది శిఖరం ఆర్ట్స్ థియేటర్లో వారు ప్రధాన ఉత్సవంలో పాల్గొనడం మా అదృష్టముగా భావిస్తున్నాము, అన్నారు, మనసున్న మారాజు అతిధి విచ్చేసిన ప్రణయ్ మాట్లాడుతూ నా చిరకాల మిత్రుడు శ్రీ రమణారెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టముగా భావిస్తున్నాను శిఖరం ఆర్ట్స్ థియేటర్ కృష్ణకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానుసంగీతంలో అభిరుచి, ప్రాధాన్యత గల వ్యక్తులకు స్వర సమ్మోహన బిరుదు ప్రధానం చేయడం చాలా గర్వంగా ఉంది అన్నారు, సరస్వతి ఉపన్యాసకులు దైవజ్ఞ శర్మ గారు బిరుదు ప్రధానోత్సవం లో ఆశీస్సులు అందజేసినారు అలాగే మరియొక అతిధి శ్రీ విజయకుమార్ విజయ్ చిత్ర అధినేత మాట్లాడుతూ కృష్ణ, శిఖరం ఆర్ట్స్ నేత కార్యక్రమంలో నాకు పాలు పంచుకోవాలని ఎప్పటినుంచో ఉంది ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి రావడం ఒక మంచి సంగీత అభిరుచి గల వ్యక్తి ఒక క్రమశిక్షణ కలిగిన రమణారెడ్డికి ఈ బిరుదు ప్రధానం చేయడం చాలా గొప్ప విషయం, శిఖరం ఆర్ట్స్ నేత కృష్ణకి, రమణారెడ్డిలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయని గాయకులు కృష్ణ, వాణి, లలిత, వర్ధమాన గాయని పద్మ, గాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Previous Post Next Post