దేశానికి ప్రాచీన వారసత్వ సంపద అందించిన గొప్ప వరం "యోగ"

 దేశానికి ప్రాచీన వారసత్వ సంపద అందించిన గొప్ప వరం "యోగ"

యోగా ఒక అద్భుత ఆయుధం

జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి



కల్వకుర్తి, జూన్ 22 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా, ఆమనగల్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షులు శ్రీ కర్నాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమనగల్ జడ్పిహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల లోని నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి హాజరయి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి నేత, తల్లోజు ఆచారి మాట్లాడుతూ "యోగం మన ప్రాచీన భారతీయ ఋషుల పరిణత దృష్టి ఫలితంగా పుట్టిన జీవనశాస్త్రం. ఇది మనిషిని సంపూర్ణంగా అభివృద్ధి చేసే పద్ధతి. శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు శాంతి, ఆత్మకు శుద్ధి కలిగించే సూత్రపధ్ధతి ఇది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పట్టుదలతో యోగ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను అలవర్చుకోవాలి. ఇది ఆరోగ్య సమాజ నిర్మాణానికి పునాది వేస్తుంది. మన యువత ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని, భవిష్యత్ తరాలకు దీపస్తంభంగా నిలవాలని ఆశిస్తున్నాను. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది–ఆ మార్గంలో యోగా ఒక అద్భుత ఆయుధం. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post