16న ఉచిత కంటి చికిత్స శిబిరం...
నాగర్ కర్నూల్, జూలై 11 (మనఊరు ప్రతినిధి): జిల్లా ఆందత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యం లో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డు లోని శోభ ఆప్టికల్ లో ఈ నెల 16న బుధ వారం నాడు ఉదయం 9గంటలకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఆప్తాలమిక్ ఆఫీసర్ బి.శివారెడ్డి తెలిపారు.ఈ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి,క్యాటరాక్ట్ పోరగల వారినీ ప్రత్యేక అంబులెన్స్ ద్వారా లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రి,ఎనుగొండ, మహబూబ్ నగర్ కి పంపించి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనునట్లు తెలిపారు.రోగులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా రక్త పరీక్షలు,సాధారణ పరీక్షలు,ప్రతిరోజు నిర్వహిస్తారని తెలిపారు.శిబిరానికి వచ్చే ముందు ఆధార్ కార్డు,ఓటర్ కార్డ్,లేదా రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని వెంట తెచ్చుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కు 9440454284, 8106333324 నెంబర్ లలో సంప్రదించాలని కోరారు.