కేంద్ర జల శక్తి అభియాన్ కమిటీ పనుల పరిశీలన

 *వడ్డేమాన్, లింగసానిపల్లి గ్రామాలలో కేంద్ర జల శక్తి అభియాన్ కమిటీ పనుల పరిశీలన*




బిజినపల్లి, జులై 11 (మనఊరు ప్రతినిధి): మండలంలోని నందివడ్డేమాన్, లింగసానిపల్లి గ్రామాలలో గ్రామాల్లో జాతీయ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర జలశక్తి అభియాన్ నోడల్ అధికారి ఆతర్వ పవర్ శుక్రవారం నాడు 2023-24 సంవత్సరంలో చేపట్టి పూర్తిచేసిన పనులను సందర్శించడం జరిగింది. లింగస్వామి పల్లి గ్రామంలో చేపట్టిన కమ్యూనిటీ సోప్ పిట్ సందర్శించి ఏ విధంగా ఉపయోగపడుతుందని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత నంది వడ్డేమాన్ లో సూరయ్య కుంటాను సందర్శించి కుంట నుండి తీసిన మట్టి రైతులుకు ఉపయోగపడిందా లేదా అనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. కమ్యూనిటీ సోప్ పిట్, కుంటలోన మట్టి తీయడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయని అదేవిధంగా తీసిన మట్టి రైతు పొలాలకు కొట్టుకోవడం వలన భూములు సారవంతం అవుతాయని తెలియజేయడం జరిగిందిచేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నుండి అడిషనల్ డి ఆర్ డి ఓ రాజేశ్వరి, రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, పవన్, మండల అభివృద్ధి అధికారి కతాలప్ప, ఏపీవో మల్లికార్జున్, ఈసీ రామ్మోహన్, సాంకేతిక సహాయకులు రాజు, రమేష్ కార్యదర్శి లింగారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ నాగేంద్రం, దేవదాసు, రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Previous Post Next Post