No title

 విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

  వైద్యాధికారిని డాక్టర్ సృజన





నాగర్ కర్నూల్, జూలై 31 (మనఊరు ప్రతినిధి): సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని , హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దముద్దునూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాదికారిణి డా.సృజన అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహాంలో హాస్టల్‌వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తరంగిణి ఆద్వర్యంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించి విద్యార్దులకు మందులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి సీజనల్‌ వ్యాదుల బారిన పడకుండా విద్యార్దులు హాస్టల్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుంటే అనారోగ్యం బారిన పడతారని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ బిసి బాలికల వసతి గృహాం స్పెషల్‌ ఆఫీసర్‌ ఎంఈఓ భాస్కర్‌రెడ్డి, డా.సాయిశ్రీ, ఎఎన్‌ఎం కవిత, ఆశావర్కర్లు మానస, కమరున్నీస పాల్గొన్నారు.

Previous Post Next Post