ఉచిత కంటి శిబిరంలో 24 మందికి కంటి ఆపరేషన్లు...
68 మందికి కంటి పరీక్షలు
ఆప్తాలమిక్ అధికారి కోట్ర బాలాజీ
నాగర్ కర్నూల్, జూలై 31 (మనఊరు ప్రతినిధి): జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నాడు నిర్వహించిన ఉచిత కంటే చికిత్స శిబిరంలో 24 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 68 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించగా అందులో అవసరమైన వారికి, అత్యవసరం ఉన్నటువంటి క్యాట్రాక్ట్ పొర గుర్తించిన 24 మందికి ప్రత్యేక అంబులెన్స్ లో లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు.లైన్స్ క్లబ్ ఆఫ్ నాగర్ కర్నూల్ అధ్యక్ష కార్యదర్శులు సురేష్ ,నరేందర్ రెడ్డి రోగులకు సహకరించి పండ్లు, బిస్కెట్లునీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి ఆర్ శ్రీనివాసులు, ప్రేమ్ కుమార్ రెడ్డి లయన్ తేప్ప శ్రీనివాసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది వివిధ గ్రామాల రోగులు పాల్గొన్నారు.