డ్రైనేజీ, సీసీ రోడ్లు వేయండి

 డ్రైనేజీ, సీసీ రోడ్లు వేయండి అని కాలనీ వాసుల వినతి 




జడ్చర్ల రూరల్, జులై 16 (మనఊరు ప్రతినిధి): మునిసిపల్ పరిధిలోని 3వ వార్డ్ లోని శ్రీ సత్యనారాయణస్వామి కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతూ మునిసిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలతకు, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిలకు కాలనీ వాసులు బుధవారం వినతి పత్రం అందజేశారు. కాలనీలో డైనేజీ, సీసీ రోడ్లు లేక అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. వ్యాధులు విజృంభిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు యం. ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కె.రాజేందర్ గౌడ్, కాలనీ పెద్దలు నాగరాజు గౌడ్, రాజేష్ (గోల్డ్), నర్సింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post