త్వరలో నూతనంగా డీసీసీ అధ్యక్ష బాధ్యతలు
హైదరాబాద్, జులై 16 (మనఊరు ప్రతినిధి): రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పూర్వవైభవం తేవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షుల్లో చాలా మందిని మార్చి, కొత్తవారిని నియమించడానికి కసరత్తు చేస్తోంది. అయితే ఈ సారి నామినేటెడ్ విధానంలో కాకుండా జిల్లా స్థాయి నేతల అభిప్రాయాలు సేకరించి ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఒక పరిశీలకుడిని నియమించనున్నారు. ఇకపై డీసీసీల పాత్ర పార్టీలో కీలకం కానుంది.