సీపిఎస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ వెంటనే జమచేయాలి

 సీపిఎస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్స్ వెంటనే జమచేయాలి

 ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సనాతన బాలస్వామి


ఉప్పునుంతల, జూలై 31 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయం నందు సిపిఎస్ ఉద్యోగుల మిస్సింగ్ క్రెడిట్ ఫై అవగాహన సదస్సును ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సనాతన బాలస్వామి నిర్వహించారు. ఈ సందర్భంగా సనాతన బాలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నప్పుడు సిపిఎస్ నుంచి జిపిఎస్ కు మార్చి ప్రస్తుతం యుపిఎస్ గా రూపాంతరం చెందిందని అన్నారు. సెప్టెంబర్ 1- 2004 నుంచి జాయిన్ అయినా ఉద్యోగులకు సిపిఎస్ మిస్సింగ్ క్రెడిట్ చాలానే ఉన్నాయని వాటిని ఎన్ఎస్ డిఎల్ యాప్ ద్వారా తెలుసుకొని డిడివో ద్వారా జమ చేసుకునే అవకాశం ఉందన్నారు.

జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం అనేది ఉద్యోగుల పాలిట శాపమని, ఎంతోమంది సిపిఎస్ ఉద్యోగులు పదవి విరమణ తర్వాత వారికి ఆసరా పెన్షన్ కన్నా తక్కువగా పెన్షన్ రావడం అనేది చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించి ఉద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల తాహసిల్దార్ ప్రమీల, డిప్యూటీ తాహసిల్దార్ పరశు, ఆర్ఐ రామకృష్ణ, బలరామ్, టీఎన్జీవో నాయకులు గణేష్, సీపీఎస్ ఉద్యోగులు చందర్, లక్ష్మణ్, వెంకటేష్, ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.


Previous Post Next Post