నిజం రాస్తే నేరమా.. మరి ఇంత ఘోరమా..

 *నిజం రాస్తే నేరమా.. మరి ఇంత ఘోరమా..* 

 *జర్నలిస్ట్ కేపీ వాహనంపై దాడిని ఖండించిన కాంగ్రెస్..* 

 *ఇది ప్రజాస్వామ్య విరుద్ధమన్న మహమ్మద్ అలీ ఖాన్ బాబర్..* 

 *జర్నలిస్టులపై దాడికి ప్రతి దాడులు తప్పవన్న పి. రఘు* 

 *పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్*



షాద్ నగర్, జూలై 15 (మనఊరు ప్రతినిధి): పాత్రికేయులు తమ అక్షరాల ద్వారా నిజాలను వెలుగులోకి తెస్తే నేరమా.. వార్తలు రాశారని సంస్థలపై, వ్యక్తులపై, వాహనాలపై దాడులు చేస్తున్నారు.. మరి ఇంత ఘోరమా.. అంటూ షాద్ నగర్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. పట్టణంలోని రైతు కాలనీలో గల సీనియర్ జర్నలిస్టు ఎండి ఖాజా పాషా (కేపీ) వాహనంపై దాడి జరిగిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశాలతో ఆయన ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు కేపీని పరామర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మాట్లాడుతూ పత్రికలు, సోషల్ మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన వార్తలను క్షణాలలో వెలుగులోకి తీసుకువస్తూ స్థానికంగా కూడా ఎప్పటికప్పుడు ఇక్కడి కార్యక్రమాలను వెలుగులోకి తెస్తున్న కెపి సొంత వాహనంపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడడం దారుణం అన్నారు. దీనిపై పోలీసులు కచ్చితంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల మహా న్యూస్ ఛానల్ సంస్థ పై దాడి, క్యూ న్యూస్ సంస్థ పై దాడి, ఇప్పుడు కేపీ వాహనంపై దాడులు ఇలాంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్య విలువలను దిగజారిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

 *దాడికి ప్రతి దాడులే: పి.రఘు* 

పాత్రికేయులపై ఎవరు దాడులకు పాల్పడిన ప్రతిదాడులు తప్పవని గిరిజన, ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘు హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత్రికేయులపై దాడులు రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. పార్కింగ్లో అన్ని వాహనాలు ఉండగా కేవలం జర్నలిస్టు కేపీని టార్గెట్ చేసి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారని స్పష్టమవుతుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సైతం ఎలాంటి దాడులు లేకుండా పోరాటాల ద్వారా సమస్యను సాధించుకున్న చరిత్ర మనకు ఉందని అన్నారు. విలేకరులు వాస్తవాలు రాయకూడదు అనడం సరికాదని, ప్రజాస్వామ్య దేశంలో హక్కులను గౌరవిస్తూ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. అన్నదమ్ముల్లా జీవిస్తున్న తెలంగాణలో రాయలసీమ సంస్కృతిని తీసుకు వస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకొని కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు. జర్నలిస్ట్ కేపీకి అండగా ఉన్నామని చిల్లర మొక్కలు దాడికి పాల్పడితే సహించబమని హెచ్చరించారు. మాజీ పురపాలక చైర్మన్ అగ్గునూరు విశ్వం మాట్లాడుతూ విలేకరులు వార్తలు రాస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా దాడులు చేయడం ఎక్కడి సంప్రదాయమని ప్రశ్నించారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

 *కేపీకి హాని చేసేందుకే - విశ్వం

జర్నలిస్టు కెపి పై దాడి చేసినందుకే ఈ కుట్ర జరిగినట్టు తమ అనుమానాలు ఉన్నాయని షాద్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూర్ విశ్వం స్పష్టం చేశారు. అర్థరాత్రి జరిగిన ఈ ధ్వంస రచనలో కె.పి కనిపించకుండా పోయేసరికి అతని వాహనంపై కొందరు కసి తీర్చుకున్నారని ఇది అర్థమవుతుందని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలు సమాజంలో మంచివి కావాలని భౌతిక దాడులు అందరూ ప్రారంభిస్తే పరిస్థితి వేరే లాగా ఉంటుందని విశ్వం హెచ్చరించారు. 

 *జర్నలిస్టుల జోలికి వస్తే ఖబర్దార్ - అందే మోహన్

జర్నలిస్టుల జోలికి ఎవరు వచ్చినా యువజన కాంగ్రెస్ ఊరుకోదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్ హెచ్చరించారు. జర్నలిస్టు కేపీని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారూ. ఇలాంటి సంఘటనలను ఎవరు ఉపేక్షించబోరని పేర్కొన్నారు. తమ్ము ధైర్యం ఉంటే ముందరికి రావాలని ఇలా వెనుక చాటు పిరికిపంద చర్యలు చేయడం మంచి లక్షణం కాదని సమాజం ఇవన్నీ చూస్తుందని పేర్కొన్నారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మరోసారి ఈ పునరావృతమైతే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. జర్నలిస్ట్ కేపీని కలిసి పరామర్శించిన వారిలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెన్నయ్య, సోలిపూర్ రాజేష్, కుమార్ గౌడ్, సయ్యద్ ఖదీర్, మార్గం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోసమైన వాహనాన్ని కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.

Previous Post Next Post