ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్ధాం
జెకె ట్రస్ట్ చైర్మన్ వి.నరసిహచారి
నవాబుపేట, జూలై 13 (మనఊరు ప్రతినిధి): ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుద్ధాం వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూద్దాం అనే నినాదంతో మానవ సేవే మాధవ సేవే అంటూ ప్రతి ఆదివారం నవాబుపేట మండల కేంద్రానికి మండల కేంద్రానికి సుమారు 70 గ్రామాలకు చెందిన ప్రజలు సంత (అంగడి)కి వచ్చే పేద ప్రజల కొసం జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జెకె ట్రస్ట్ చైర్మన్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి. నరసింహచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన కార్యక్రమం 45 వారం కూడా విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహిస్తున్న అంగడికి వస్తున్న పేద ప్రజలు భోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెకె ట్రస్ట్ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.