స్థానిక సంస్థల్లో 400 సీట్లు కేటాయించాలి

 విశ్వకర్మలకు అన్ని పార్టీలు స్థానిక సంస్థల్లో 400 సీట్లు కేటాయించాలి






జడ్చర్ల రూరల్, జులై 10 (మనఊరు ప్రతినిధి): స్థానిక సంస్థల్లో విశ్వకర్మలకు అన్ని పార్టీలు 400 సీట్లు కేటాయించాలని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ అధినేత విశ్వనాధుల పుష్పగిరి అన్నారు. గురువారం విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రలో భాగంగా 5వ రోజు జడ్చర్లకు చేరుకుంది. ఈ యాత్రకు విశ్వబ్రాహ్మణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులను చైతన్య పర్చెందుకు ఈనెల 6న ఎల్ బి నగర్ నుంచి శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరం వరకు 450 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పంచదాయిలు వృత్తులు కోల్పోయి, ఉపాధి కోల్పోయి దుర్భరమైన స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. విశ్వకర్మలు కనీసం ఉనికిని చాటుకునే దశలో కూడా లేనందున ఉమ్మడిగా ఐక్య పోరాటాలు నిర్మించాల్సిన ఆవశ్యకతను గుర్తించి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఈ పాదయాత్రను చేపడుతోందని గుర్తు చేశారు. అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ఈ ఎన్నికలలో విశ్వబ్రాహ్మణులు అత్యధిక స్థాయిలో పోటీ చేసి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోపక్క 42శాతం అమలుపరుస్తామన్న ప్రభుత్వం దానిలో 5శాతం విశ్వబ్రాహ్మణుల కోసం కేటాయించాలని డిమాండ్ ఆయన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల విశ్వబ్రాహ్మణ బులియన్ మార్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గోల్కొండ రాజేష్ చారి, ఉపాద్యక్షులు ఇరువెంటి రాజేష్, అధ్యక్షులు తల్లోజు భాస్కరాచారి, నాయకులు మారోజు కృష్ణమూర్తి, శ్రీనివాస్ చారి, రాజగోపాల్ చారి, సంతోష్ చారి, వేణుచారి, సత్యం, బాబు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post