నీవు నాకు కావాలి...
నా కోరిక తీర్చాలి...
నా మాట వినకుంటే
నీ భర్తను చంపేస్తా !
చావో రేవో తేల్చుకో
___ఓ దినసరి కూలికి మేస్త్రి బెదిరింపు
నవాబుపేట, జూలై 10 (మనఊరు ప్రతినిధి): కొంతమంది ప్రబుద్ధుల ప్రవర్తన కారణంగా మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రబుద్ధుల ప్రవర్తనలు మహిళలను విపత్కర పరిస్థితులలోకి నెట్టుతున్నాయి. దానివల్ల వారు తమ సంసారాలను సాఫీగా చేసుకోలేకపోతున్నారు. ఇంకా తాము ఎదుర్కొంటున్న బాధలకు తట్టుకోలేక లోలోపల్లే మదనపడుతూ కృంగిపోతున్నారు. వారి ఆర్థిక మానసిక పరిస్థితులు వారిని నిలువుటెల్ల ప్రకంపనలకు గురిచేస్తున్నాయి. అందువల్లే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నారు.
నీవు నాకు కావాలి, నీవు నా మాట విని నా కోరిక తీర్చకుంటే నీ భర్తను చంపేస్తా అంటూ ఓ మేస్త్రి కూలీని బలవంత పెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూలి పనులకు వెళ్లిన మహిళను మచ్చిక పరుచుకొని ఆమె భర్తతో స్నేహం పెంచుకొని తుదకు ఆమెపై అఘాయిత్యానికి గురైన దిక్కుతోచని మహిళ తనకు న్యాయం భర్తతో పాటు నవాబుపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవాబుపేట మండల కేంద్రానికి చెందిన 20 సంవత్సరాల వయస్సు గల ఓ వివాహిత యువతి మహబూబ్ నగర్ జిల్లా వైద్యుని వడ్డే సురేందర్ వద్దకు కూలి పనులకు వెళ్ళేది. ఆమెతో చనువుగా ఉన్న సురేందర్ ఆమెను లోబరుచుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. ఇంకా తన కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంకా ఆమె ద్వారా ఆమె భర్త మైబుతో పరిచయం పెంచుకొని చనువుగా మెదిలాడు. ఈ సందర్భంలోనే సురేందర్ వేధింపులు అధికం కావడంతో ఆమె అతని వద్దకు పనికి వెళ్లడం మానుకుంది. ఆమెను అనుభవించాలన్న బలమైన కోరిక ఉన్న సురేందర్ ఎలాగైనా ఆమెతో గడపాలని తీర్మానించుకొని నెలరోజుల క్రితం మహబూబ్ నగర్ నుండి నవాబుపేటకు కారులో వచ్చాడు. ఆ సమయంలో శిరీష ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెను తనతో రావాలని, తనతో రాకుంటే ఆమె భర్త మైబును చంపేస్తానని బెదిరించి, బలవంతంగా ఆమె చేయి పట్టి లాక్కుంటూ కారులో ఎక్కించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం వైపు వెళ్ళాడు. అతనితో వెళ్లడం ఇష్టం లేని శిరీష కారులో పెద్దగా అరవడంతో యన్మన్ గండ్ల గ్రామ గేటు సమీపంలో ఆమెను కారు దించివేసి అక్కడి నుంచి తన కారులో పరారయ్యాడు. ఈ సంఘటనతో తీవ్రమనస్థాపానికి లోనైన శిరీష సురేందర్ చేసిన ఘాతుకం గురించి ఎవరికి చెప్పుకోలేక తనలో తానే నెలరోజులుగా మదనపడుతుండటం గమనించిన ఆమె భర్త మైబు ఆమె అలా ముభావంగా ఉండడానికి కారణం ఆరా తీయగా తన పట్ల సురేందర్ వ్యవహరించిన తీరు గురించి ఆమె భర్తకు వివరించి బోరుమంది. తనతో ఉన్న చనువును ఆధారంగా చేసుకుని తన భార్య పట్ల సురేందర్ ప్రవర్తించిన తీరు విని హతాశుడైన మైబు ఈ విషయాన్ని స్థానిక ఎస్సై విక్రమ్ కు వివరించారు. శిరీష తన పట్ల సురేందర్ ప్రవర్తించిన తీరును గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేసింది. సంఘటనకు సంబంధించి బాధితురాలు శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లుసై విక్రమ్ తెలిపారు.