బీజేపీలో బీసీలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తుంది
దేశం కోసం, ధర్మం కోసం,పాటు పడే పార్టీ బిజెపి
బిజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. రాజేశ్వర్
జడ్చర్ల రూరల్, జూలై 29 (మనఊరు ప్రతినిధి): బిజెపి బీసీలకు సముచిత ప్రాధాన్యతను ఇస్తుందని బిజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాజేశ్వర్, జిల్లా అధికార ప్రతినిధి ఎడ్ల బాలవర్దన్ గౌడ్ లు అన్నారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో బిజెపి నలుగురు బీసీ నాయకులను మండల పార్టీ అధ్యక్షులుగా, ఇద్దరు గిరిజనులకు మండల పార్టీ అధ్యక్షులుగా, ఒక ఎస్సీకి మండల అధ్యక్షులుగా అదేవిధంగా జిల్లాలో ముఖ్యమైన బాధ్యతలు జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న బీసీ లే ఉన్నారని తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలలో పార్టీ కి అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తులకు, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నా వ్యక్తులకు మధ్య జరిగిన వాగ్వాదంలో బీసీ సంఘాలు తలదూర్చి, బీసీ నాయకులను అవమాన పరచరంటూ, మాట్లాడడం హాస్యాస్పదం. కానీ కొందరు బీసీ నినాదాన్ని తీసుకు వచ్చి, బిజెపి రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో బలహీనపరిచేలా మాట్లాడటం మంచిది కాదన్నారు. దయచేసి బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వారు గతంలో మాజీ ఎంఎల్ఏ ఎర్ర శేఖర్ బిజేపీ జిల్లా అధ్యక్షులుగా ఉంటే వారిని అగౌరపరిచి పార్టీలో నుండి వెళ్ళిపోయేలా చేసింది ఎవరో ఆలోచించాలని, అలాగే మహబూబ్ నగర్ లో ఎంపీ వెంకటేష్ ని కూడా అవమాన పరిచి పార్టీలో నుంచి వెళ్ళిపోయేలాగ చేసింది ఎవరో ఆలోచన చేయాలన్నారు. దయచేసి బీసీ సోదరులకు మేము ఒక బీసీ బిడ్డలుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీలో బీసీలకు సముచిత ప్రాధాన్యత, స్థానంలోనే ఉన్నామని స్పష్టం చేశారు. కానీ వారు బీసీ పేరు చెప్పుకుంటూ బీసీలా యెుక్క ఎదుగుదలను అణచివేసింది ఎవరో అందరికీ తెలుసు అన్నారు. ఈటివల రాష్ట్ర అధ్యక్షుల యొక్క జిల్లా పర్యటనలో భాగంగా కొందరు వ్యక్తులు ప్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారు 14నెలల నుండి పార్టీ కోసం పని చేయకుండ నిరంతరము పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతిసే విధంగా రాష్ట్ర అధ్యక్షుని యొక్క మెప్పు పొందాలనే దురుద్దేశంతో ప్రోటోకాల్ పాటించకుండా పార్టీని, పార్టీ కోసం పని చేసే కార్యకర్తలను అగౌరపరిచారనే విషయాన్ని బీసీ సంఘాల సోదరుల గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంబి బాలకృష్ణ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాపోతుల శ్రీనివాస్ గౌడ్, బిజెపి యువమోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, జడ్చర్ల టౌన్ అధ్యక్షులు అమర్నాథ్ గౌడ్, కిసాన్ మోర్చా నాయకులు బుక్కా నవీన్, వెంకటేష్, క్రాంతి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.