*కోడుగల్ గ్రామంలో టొబాకో ఫ్రీ జనరేషన్ స్కూల్ విద్యార్థుల ర్యాలీ...*
జడ్చర్ల రూరల్, జూలై 29 (మనఊరు ప్రతినిధి): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోడుగల్ లో టొబాకో ఫ్రీ జనరేషన్ స్కూల్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థుల ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మారేపల్లి శ్రీనివాసులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు “ధూమపానం ఆరోగ్యానికి హానికరం”, “పనముతో కాదు, ప్రమాణంతో మారుదాం” వంటి నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి జనాలలో అవగాహన కలిగించారు. విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ, నూతన తరం పొగాకు దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉండేందుకు విద్యార్థులలో చిన్ననాటి నుంచే అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గ్రామ సచివాలయం ముందు టొబాకో వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు షాహినాపర్వీన్, కృష్ణయ్య, అమరేందర్ రెడ్డి, స్లీవారెడ్డి, ఉమాదేవి, శశిధర్, అనసూయ, కరుణాకర్, శరణప్ప, గోవర్ధన్, శ్రీనివాస్ శెట్టి, ఆంజనేయులు, మల్లికార్జునలింగం, అంజలి దేవి, తాహేర్, రవికుమార్, స్ఫూర్తి, లావణ్య పాల్గొన్నారు.