*ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు*
హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. రాత్రి వేళల్లో మాత్రమే చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఇక నుంచి పగటి పూట కూడా చేర్చారు నగర జైంట్ కమిషనర్ జోయల్ డేవిస్. బుధవారం ఖైరతాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ను ఆయన పరిశీలించారు. పగలైనా, రాత్రైనా మద్యం తాగి వాహనాలు నడిపితే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరిక.
*హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇకపై రాత్రిపూట మాత్రమే కాకుండా పగటిపూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అరికట్టడానికి జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ ఈ కొత్త చొరవను ప్రకటించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి పగటిపూట ఏ సమయంలోనైనా కఠినమైన శిక్షలు విధించబడతాయి.*